లింగంపేట, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేశ్‌షెట్కార్‌ను భారీ మెజార్టీతో గెలిపిస్తే కామారెడ్డి నుంచి లింగంపేట, ఎల్లారెడ్డి మీదుగా బీదర్ వరకు రైల్వే లైన్ఏర్పాటుకు కృషి చేస్తానని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్మోహన్రావు హామీనిచ్చారు. ఆదివారం ఆయన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని మోతె, గాంధీనగర్, ముస్తాపూర్, ఒంటర్పల్లి, సురాయిపల్లి, కన్నాపూర్, ఐలాపూర్ గ్రామాల్లో బైక్‌ర్యాలీ తో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రితో మాట్లాడి లింగంపేట మండలంలో 50 ఎకరాల విస్తీర్ణంలో ఇండస్ట్రీయల్ కారిడార్‌ను, స్కిల్‌డెవలప్‌మెంట్ సెంటర్లు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానన్నారు. లింగంపేట మండల కేంద్రంలో రైల్వే స్టేషన్, సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేయిస్తానన్నారు. కాంగ్రెస్‌పార్టీ మండల అధ్యక్షుడు బుర్ర నారాగౌడ్, జడ్పీటీసీ శ్రీలత సంతోష్‌రెడ్డి, ఎంపీపీ నయీం, రఫియోద్దిన్, ఎల్లమయ్య, సుప్పాలరాజు తదితరులు పాల్గొన్నారు.