కరివేన ప్రాజెక్టును చూసి మురవాల్సిందేనా!

కరివేన ప్రాజెక్టును చూసి మురవాల్సిందేనా!

అడ్డాకుల, వెలుగు : కరివేన ప్రాజెక్టు నీటిని వాడుకోవడానికి కెనాల్స్​ లేవని, వాటి కోసం భూమి సేకరించలేదని ఇరిగేషన్​ ఆఫీసర్లు చెప్పడంతో విస్తు పోయానని ఎమ్మెల్యే మధుసూధన్​రెడ్డి తెలిపారు. మూసాపేట మండలకేంద్రంలో మంగళవారం ఎమ్మెల్యే విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరివేన ప్రాజెక్టును చూసి మురవాల్సిందేనా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్  నేతలు వారి అవసరాల కోసం కరివేన ప్రాజెక్టును కట్టారని

అన్ని గ్రామాల్లో చెరువుల నుంచి నల్ల మట్టిని ఫ్రీగా తరలించి బిల్లులు తీసుకున్నారని ఆరోపించారు. 2015లో ప్రాజెక్టు ప్రారంభమైందని, అప్పుడే కాలువలకు భూమిని సేకరించి ఉంటే ఇప్పటికే పనులు పూర్తయ్యేవని తెలిపారు. ప్రాజెక్టును పూర్తి చేసి సాగునీటిని అందించాలని అధికారులను రిక్వెస్ట్  చేసినట్లు చెప్పారు.

తెలంగాణలో ఎంపీ ఎలక్షన్ల తర్వాత బీఆర్ఎస్  పార్టీ ఉండదని, వేల కోట్లు దోచుకొని ప్రజలను మోసం చేశారని విమర్శించారు. శెట్టి శేఖర్, రామన్ గౌడ్, సత్యనారాయణ, భాగ్య కృష్ణయ్య పాల్గొన్నారు.