ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విషయంతో తనకు ఏమాత్రం సంబంధం లేదని పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి స్పష్టం చేశారు. తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు టీఆర్ఎస్ పార్టీని వీడేదిలేదని భావోద్వేగానికి గురయ్యారు. తనకు నందు అనే వ్యక్తితో ఎలాంటి పరిచయం లేదన్నారు.
పైలట్ నాకు సహచరుడే..
బీజేపీ కుట్ర రాజకీయాలను తెలంగాణ ప్రజలు నమ్మరని ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎలాంటి ప్రలోభాలకు లొంగరని చెప్పారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా మునుగోడులో టీఆర్ఎస్ గెలుస్తుందన్నారు. తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తన సహచరుడు మాత్రమే అని తెలిపారు. తనను మొయినాబాద్ ఫాంహౌజ్కు ఎవరూ పిలవలేదన్నారు.