‘ఖాకీ బట్టలు తీసి ఖద్దర్ డ్రెస్ వేసుకో’.. రంగనాథ్‎పై మహేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్

‘ఖాకీ బట్టలు తీసి ఖద్దర్ డ్రెస్ వేసుకో’.. రంగనాథ్‎పై మహేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్

హైదరాబాద్: హైడ్రా కమిషనర్ రంగనాథ్‎పై బీజేపీ ఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యవహారం పని తక్కువ పబ్లిసిటీ ఎక్కువ అన్న చందంగా ఉంది..  సాధారణంగా పొలిటీషియన్లు తక్కువ పని చేసి ఎక్కువ పబ్లిసిటీ కోరుకుంటారు.. కానీ పొలిటీషియన్లను మించి ఏవీ రంగనాధ్ పబ్లిసిటీ కోరుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

 ఐపీఎస్ అధికారులు వారి వృత్తిలో భాగంగా అవసరమైతనే మీడియాతో మాట్లాడాలి. కానీ రంగనాధ్ తన ఇమేజ్ ప్రమోషన్ కోసం అదే పనిగా ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటున్నారు. సరే హైడ్రా సంస్ధ గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఇంటర్వ్యూలు ఇస్తే ఫర్వాలేదు. కానీ ఇంటర్వ్యూల్లో నన్ను ఉద్దేశించి మాట్లాడడమే కరెక్టు కాదని అసహనం వ్యక్తం చేశారు. 

ALSO READ | హైడ్రా పేరుతో డబ్బులు వసూలు చేసే అధికారులపై కఠిన చర్యలు : సీఎం రేవంత్ రెడ్డి

గతంలోనూ ప్రజానాయకుడు బండి సంజయ్‎ను అరెస్ట్ చేసి ఇలాగే రంగానాథ్ పబ్లిసిటీ చేసుకున్నారని గుర్తు చేశారు. రాజకీయ నాయకుడివి కావాలంటే, ఖాకీ వదిలి ఖద్దర్ దుస్తువులు వేసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి ఇచ్చే ప్రమోషన్, లేకుంటే రాజకీయ పదవి కోసమే.. రంగనాథ్ తాపత్రయమామని విమర్శించారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారి వెంకట్రామ్ రెడ్డి కూడా ఇలాగే చేసి రాజకీయ నాయకుడు అయ్యారని గుర్తు చేశారు. 

హై డ్రా కమిషనర్‎కు హై సెక్యూరిటీ అంటూ హంగామా చేస్తున్నారు. టెర్రరిస్టులు, నక్సల్స్‎తో పోరాడిన ఎంతో మంది అధికారులు ఉన్నారు. అంత కంటే ఏం ఎక్కువ చేశారని రంగనాథ్‎కు సెక్యూరిటీతో హైప్ క్రియేట్ చేస్తున్నారని అన్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఐపీఎసా ...  పొలిటికల్ లీడరా అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు.

ALSO READ | మరో సంచలనానికి తెరలేపిన హైడ్రా.. అధికారులపై కేసుల నమోదుకు రంగం సిద్ధం

హైడ్రా చెరువుల ఆక్రమణలను కూల్చడాన్ని బీజేపీ స్వాగతిస్తుందని.. కానీ పాతబస్తీ, సల్కం చెరువులో అక్రమణ కూల్చాకే.. మిగతావి కూల్చాలని డిమాండ్ చేశారు. సల్కం చెరువులో ఒవైసీ అక్రమ కట్టడాల కూల్చివేతకు కావాలని సమయం ఇస్తున్నారని అన్నారు. ఎంఐఎంకు భయపడి సీఎం రేవంత్ రెడ్డి పాతబస్తీవైపు చూడటం లేదని.. ఒకవర్గం వారినే టార్గెట్ చేసి, మిగతా వారిని సేవ్ చేస్తున్నారని విమర్శించారు. ఒవైసీ విద్యాసంస్థలకు ఒక న్యాయం మిగతా వారికి మరో న్యాయమా అని ప్రభుత్వాన్ని నిలదీశారు.

ALSO READ | ఓటుకు నోటు కేసు విచారణ వాయిదా

 కావాలనే హిందువులకు చెందిన వారి ఆస్తులనే టార్గెట్ చేస్తూ.. పాతబస్తీలోని అక్రమణలు, చెరువులో కట్టిన ఒవైసీ కాలేజీలకు టైం ఇస్తున్నారని మండిపడ్డారు. అకాడమిక్ ఇయర్ మధ్యలో కూల్చివేతలు ఎందుకుని ఆపామన్న హైడ్రాకు కౌంటర్ కు ఇచ్చారు. అకాడమిక్ ఇయర్ ఎప్పుడూ ఎండ్ కాదని, ఏదో ఒక కోర్సు కంటిన్యూ అవుతుంది. మరీ ఆ భవనాలను భవనం కూల్చేందుకు హైడ్రాకు ఎప్పుడు సమయం దొరుకుతుందని ప్రశ్నించారు.