- బేల్ అధికారులను కోరిన ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి
రామచంద్రాపురం, వెలుగు : ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి పనుల విషయంలో సహకారం అందించాలని బీహెచ్ఈఎల్ఉన్నతాధికారులను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి కోరారు. గురువారం బేల్ఈడీ భరణి రాజా, ఇతర అధికారులను కలిసిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెల్లాపూర్మున్సిపల్ పరిధిలోని ఎంఐజీ కాలనీ డ్రైనేజీ కాల్వ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని
అన్నమయ్య కాలనీ నుంచి బీమ్యాక్ వరకు మూసివేసిన రోడ్డును తెరిపించాలని కోరారు. ఎమ్మెల్యే వినతులపై స్పందించిన ఈడీ రాజా బేల్ తరుపున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తెల్లాపూర్మున్సిపల్ వైస్చైర్మన్రాములు గౌడ్, బీఆర్ఎస్నాయకుడు సోమిరెడ్డి, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
సీఎస్ఆర్ నిధులు కేటాయించండి
పటాన్చెరు: సీఎస్ఆర్నిధులను స్థానిక గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి కేటాయించాలని కలెక్టర్ క్రాంతిని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు. గురువారం సంగారెడ్డిలోని కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పరిశ్రమలు నెలకొల్పిన గ్రామాల పరిధిలోనే సీఎస్ఆర్ నిధులు ఖర్చు చేసేలా ఆదేశాలు జారీ చేయాలన్నారు.
నియోజకవర్గ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనులకు బిల్లులు రాక మాజీ ప్రజాప్రతినిధులు, కాంట్రాక్టర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్ బిల్లులు చెల్లించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. స్పందించిన కలెక్టర్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.