రామచంద్రాపురం (అమీన్పూర్), వెలుగు: సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. శనివారం అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని పలు కాలనీలలో రూ. కోటితో చేపట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. మున్సిపల్ చైర్మన్ పాండురంగా రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ అమీన్పూర్ను ఆదర్శ మున్సిపాలిటీగా మారుస్తామన్నారు.
అభివృద్ధి విషయంలో అందరూ కలిసి రావాలని, రాజకీయాలకు అతీతంగా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఇప్పటికే కాలనీలన్నింటిలో యూజీడీ, సీసీ రోడ్లు, తాగునీరు, పార్కులు, స్ర్టీట్ లైట్లు పూర్తి చేశామని పేర్కొన్నారు. వైస్ చైర్మన్ నర్సింహాగౌడ్, ఆయా వార్డుల కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.