
రామచంద్రాపురం, వెలుగు: రైతులు దళారులను నమ్మి నష్టపోవద్దని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని అమ్ముకోవాలని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సూచించారు. శుక్రవారం తెల్లాపూర్మున్సిపాలిటీ పరిధిలోని వెలిమెలలో వ్యవసాయ సహకార పరపతి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడు తూ రైతులు పండించిన సన్న రకం వడ్లకు ప్రభుత్వం రూ.2 వేల 320తో పాటు క్వింటాల్‌కు అదనంగా రూ. 500 బోనస్చెల్లిస్తోందన్నారు.
దళారులకు ధాన్యం విక్రయిస్తే నష్టపోతారని సూచించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్బుచ్చిరెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్, సీనియర్‌నాయకులు సోమిరెడ్డి, దేవేందర్ యాదవ్, మధు, మదన్ రెడ్డి, నాగిరెడ్డి, రాజ్‌కుమార్, సాగర్, దయాకర్‌రెడ్డి పాల్గొన్నారు.