రామచంద్రాపురం/పటాన్చెరు, వెలుగు : గ్రామాల అభివృద్ధికి స్థానికంగా ఉన్న పరిశ్రమలు సహకరించాలని ఎమ్యెల్యే మహిపాల్ రెడ్డి కోరారు. పటాన్చెరు మండలం రుద్రారం గ్రామంలో తోషిబా పరిశ్రమ సాయంతో రూ. కోటి 8 లక్షల నిధులతో నిర్మించిన పల్లె దవాఖానా భవనం, మూడు ఆర్వో ప్లాంట్లను గురువారం ఆయన ప్రారంభించారు. అనంతరం రూ. 60 లక్షలతో చేపట్టే సీసీ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వైద్య సేవలు అందించడానికి ముందుకు రావడం అభినందనీయమన్నారు.
విద్య, వైద్యం విషయంలో ఇక్కడ ఉన్న పరిశ్రలు తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముత్తంగిలో అధికారులతో కలిసి పర్యటించారు. క్రీడా ప్రాంగణానికి భారీ నిధులు కేటాయిస్తామని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సుధీర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి, పీఏసీఎస్చైర్మన్పాండు, ఎంపీవో హరిశంకర్, తోషిబా ప్రతినిధి రామకృష్ణ, మేరాజ్ఖాన్పాల్గొన్నారు.