పేదల సొంతింటి కల నెరవేరుస్తాం : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

పేదల సొంతింటి కల నెరవేరుస్తాం : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం/పటాన్​చెరు, వెలుగు: నిరుపేదల సొంతింటి కల సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం ఇందిరమ్మ మోడల్​హౌస్ నిర్మాణం కోసం అధికారులతో కలిసి స్థల పరిశీలన చేశారు. బ్లాక్​ఆఫీస్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మొదటి విడతలో సొంత స్థలం ఉన్న లబ్ధిదారులకు నిధులు కేటాయిస్తామని చెప్పారు.

పూర్తి పారదర్శకంగా అర్హుల ఎంపిక జరుగుతుందని, ప్రజలెవరూ దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. మోడల్ హౌస్ నిర్మాణాన్ని త్వరలోనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మాజీ జట్పీటీసీ సుధాకర్​రెడ్డి, హౌసింగ్ ఏఈ సత్యనారాయణ, ఐలేశ్ పాల్గొన్నారు.