రామచంద్రాపురం/పటాన్చెరు(గుమ్మడిదల), వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేస్తోందని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. మంగళవారం గుమ్మడిదల మండలం 13 గ్రామపంచాయతీల్లో రూ.12.30 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్లు, అంతర్గత మురుగునీటి కాలువలు, ఫంక్షన్ హాళ్లు, కమ్యూనిటీ హాళ్లు, తదితర అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రామ సభల ద్వారా అభివృద్ధి ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జడ్పీటీసీ కుమార్ గౌడ్, వైస్ ఎంపీపీ మంజుల వెంకటేశ్ గౌడ్, నాయకులు, పాల్గొన్నారు.
త్వరలో గద్దర్ కాంస్య విగ్రహావిష్కరణ
పటాన్చెరులోని బస్టాండ్ ఆవరణలో 11 అడుగుల గద్దర్ కాంస్య విగ్రహం ఏర్పాటు చేయబోతున్నట్లు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి మంగళవారం తెలిపారు. ఇప్పటికే 6 ఫీట్ల గద్దె నిర్మాణంతోపాటు 11 అడుగుల కాంస్య విగ్రహం ఆవిష్కరణకు సిద్ధమైందన్నారు.