సంస్కృతీ సంప్రదాయాలకు సీఎం పెద్దపీట : ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి

సంస్కృతీ సంప్రదాయాలకు సీఎం పెద్దపీట : ఎమ్మెల్యే మహిపాల్​రెడ్డి

 జిన్నారం, వెలుగు: తెలంగాణ తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన మండల పరిధిలోని శివానగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మల్లికార్జున స్వామి కల్యాణ మహోత్సవం, జాతర ఉత్సవాల్లో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్ తో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్వామివారి ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. 

అనంతరం బీఆర్ఎస్ నాయకులు వెంకటేశం గౌడ్, మాజీ జడ్పీటీసీ బాల్ రెడ్డి, సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుడ మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, బ్లాక్  కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు కృష్ణ వేర్వేరుగా జాతరలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ సర్పంచులు రేఖ, రాజు, జనార్దన్, ఆంజనేయులు, శివరాజ్, మాజీ ఎంపీటీసీ మహేశ్ పాల్గొన్నారు.