- ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
రామచంద్రాపురం, వెలుగు: పటాన్చెరు సెగ్మెంట్ పరిధిలోని మూడు జీహెచ్ఎంసీ డివిజన్లను ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తెలిపారు. గురువారం రామచంద్రాపుం డివిజన్లోని మయూరి నగర్, శ్రీసాయి కాలనీలో రూ. 61.50 లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డు పనులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కాలనీలలో మౌలిక సౌకర్యాల ఏర్పాటుకు పెద్దపీట వేస్తున్నామన్నారు. ఇప్పటికే యూజీడీ, తాగునీటి పైప్లైన్ల పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. కాలనీలలో సమస్యలు ఉంఏట తన దృష్టకి తీసుకురావాలని ఆయా కాలనీల అసోసియేషన్లకు సూచించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పుష్ప, నగేశ్, ఐలేశ్ యాదవ్, జీహెచ్ఎంసీ అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.