
రామచంద్రాపురం/పటాన్చెరు, వెలుగు: నాటి ప్రభుత్వాల హయాంలో అన్ని స్కాములేనని నేటి బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అన్ని స్కీములేనని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం పటాన్చెరు మండల పరిధిలోని చిట్కుల్ గ్రామంలో వివిధ అభివృద్ధి పనులను శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాబోయే రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయని, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి, జడ్పీటీసీ సుప్రజా వెంకట్ రెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీశైలం యాదవ్, ఎంపీటీసీలు మంజుల శ్రీశైలం, మాధవి నరేందర్ రెడ్డి, ముత్తంగి సర్పంచ్ ఉపేందర్, చిట్కుల్ ఉప సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, దశరథ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, మెరాజ్ ఖాన్, దుర్గయ్య, భుజంగం, గౌరీ పాల్గొన్నారు.
అమీన్పూర్లో..
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండల పరిధిలోని జానకంపేట గ్రామంలో 5 కోట్ల రూపాయలతో చేపట్టిన నూతన గ్రామపంచాయతీ భవనం, సీసీ రోడ్లు, కుల సంఘాల భవనాలు, క్రీడా ప్రాంగణం, మిషన్ భగీరథ వాటర్ ట్యాంకు, పల్లె ప్రకృతి వనం, తదితర పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ దేవానందం, జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి, సర్పంచులు కృష్ణ, భాస్కర్ గౌడ్, శ్రీకాంత్ పాల్గొన్నారు.