ప్రజా సమస్యల పరిష్కారం స్థానిక నాయకులదే : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

ప్రజా సమస్యల పరిష్కారం స్థానిక నాయకులదే : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి

రామచంద్రాపురం, వెలుగు:  పదవిలో ఉన్నా లేకున్నా ప్రజా సమస్యల పరిష్కార బాధ్యత స్థానిక నాయకులదేనని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. అధికారులకు, ప్రజలకు వారధిగా నాయకులు పనిచేస్తేనే సమస్యలు పరిష్కారమవుతాయని ఆయన పేర్కొన్నారు. బుధవారం తెల్లాపూర్​ మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డులలో రూ. 17. 82 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఎమ్మెల్యే చేశారు.  ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ..  ఓట్లేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలని నాయకులకు సూచించారు.  

నాలుగు రోజుల్లో పాలకవర్గం పదవీకాలం పూర్తవుతుందని, మాజీలుగా మారినా ప్రజా సమస్యలపై స్పందించాలని కోరారు. తెల్లాపూర్​ను దాదాపు 200 కోట్ల నిధులతో అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా మార్చామన్నారు.   కార్యక్రమాలలో మున్సిపల్​ చైర్మన్ లలితా, వైస్ చైర్మన్​ రాములు గౌడ్​, కమీషనర్​ సంగారెడ్డి, తహసీల్దార్ సంగ్రామ్​ రెడ్డి, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.