రోడ్లకు ఫండ్స్​ ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి రిక్వెస్ట్​

రోడ్లకు ఫండ్స్​ ఇవ్వాలని మంత్రి కోమటిరెడ్డికి ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి రిక్వెస్ట్​

హైదరాబాద్, వెలుగు: పటాన్ చెరు నియోజకవర్గంలో రోడ్లను విస్తరించడంతో పాటు, రిపేర్లకు నిధులు కేటాయించాలని  ఆర్ అండ్ బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి  కోరారు.  ఆదివారం మంత్రిని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. తన నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకమైన పరిశ్రమలతో పాటు ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండటంతో రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయని, దీంతో ప్రజలు, ఈ ప్రాంతంలో ఉన్న ఇంజినీరింగ్ కాలేజీల్లో చదివే విద్యార్థులు ప్రమాదాల బారిన పడుతున్నారని మహిపాల్ రెడ్డి వివరించారు. పటాన్ చెరు నుంచి శంకర్ పల్లి వరకు ఉన్న డబుల్ లైన్ రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించాల ని, ఇందుకు రూ.70 కోట్లు కేటాయించా లన్నారు. పటాన్ చెరు నుంచి మల్కాపూర్ రోడ్డు రిపేర్లకు రూ. 5.25 కోట్లు కేటాయించాలని కోరారు.