మల్కాజిగిరి నియోజకవర్గం అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే ఏ పార్టీకి చెందిన వారైనా సహించేది లేదని ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు తెలిపారు. పార్టీలకు అతీతంగా నియోజకవర్గం అభివృద్ధికి అందరూ సహకరించాలని కోరారు. ప్రజలు తన వెంటే ఉన్నారని..రాష్ట్రంలో మల్కాజిగిరిని ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు. మేడ్చల్ జిల్లా కోర్టుకు భవన నిర్మాణ స్థలం ..నేరేడ్ మెట్ప్రాంతంలోని డైట్ కాలేజీకి స్థలాన్ని కేటాయింపుకు కృషి చేసిన మైనంపల్లిని మల్కాజిగిరి న్యాయవాదులు అత్మీయత సన్మానం నిర్వహించారు. నియోజకవర్గంలో ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిచేందుకు కృషి చేస్తున్నానని చెప్పారు.పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా ప్రయత్నం చేస్తున్నామన్నారు.