- ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఫైర్
- నా కొడుక్కు టికెట్ ఇవ్వకుంటే ఇండిపెండెంట్లుగా పోటీ చేస్తం
హైదరాబాద్, వెలుగు : మంత్రి హరీశ్ రావు మెదక్ లో పెత్తనం చేస్తున్నారని, డిక్టేటర్ లా ప్రవర్తిస్తున్నారని మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు అన్నారు. సోమవారం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన హరీశ్ రావు పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు గతం గుర్తించుకోవాలి.. ఒక ట్రంకు డబ్బా, రబ్బరు చెప్పులతో వెలమ హాస్టల్ కు వచ్చిన రోజులను తాను చూశానన్నారు.
తాను హీరోగా అమెరికా నుంచి వస్తే, ఆయన రబ్బరు చెప్పులేసుకొని ఉన్నాడని, తనకన్నా చిన్నవాడైనా.. ఇయ్యాల ఏదో గొప్పనేతగా ప్రవర్తిస్తున్నాడని మండిపడ్డారు. సిద్దిపేట అభివృద్ధి చెందింది కానీ మెదక్ ఎందుకు డెవలప్ కాలేదో ఆయన చెప్పలేదన్నారు. తన కుమారుడికి టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్అభ్యర్థులుగా పోటీ చేస్తామన్నారు. ఈ ఎన్నికల వరకు తమపైనే ఫోకస్ చేస్తానని.. వచ్చే ఎన్నికల్లో సిద్దిపేట నుంచి బరిలోకి దిగుతానన్నారు.