పెద్దపల్లి: అక్కడ మోదీ, ఇక్కడ కేడీలను గంగలో కలుపుదామని ఎమ్మెల్యే మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పిలుపునిచ్చారు. బీజేపీని బొందపెడదామన్నారు. బీఆర్ఎస్ బానిస పాలన నుంచి విముక్తి కల్పించామన్నారు. రాష్ట్రాన్ని కేసీఆర్, కేటీఆర్ అప్పలు పాలు చేశారని మండపడ్డారు. పెద్దపల్లి ప్రాంతానికి కాంగ్రెస్ సాగు నీరు ఇచ్చిందన్నారు. దేశానికే దశ దిశ ను చూపెట్టడానికి కాంగ్రెస్ మ్యానిఫెస్టో ఉందన్నారు.
రైతుల నుంచి ప్రతి గింజను కొంటామన్నారు. కార్యకర్తలకు, రైతులకు ఎమ్మెల్యేందరితో పాటు పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీతో పాటు అందుబాటులో ఉంటామన్నారు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. వంశీ గెలుపుకోసం ఇతర పార్టీల నాయకులను కాంగ్రెస్‌లోకి తీసుకురావాలన్నారు. వంశీని బంపర్ మెజారిటీతో గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ జెండా పట్టుకోవడానికే ఆలోచించాలన్నారు. వంశీని గెలిపించి పెద్దపల్లి నుంచి బెల్లంపల్లి, మంథని వరకు పారిశ్రామిక కారిడార్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ఎంపీగా గెలిపిస్తే పార్లమెంట్లో వంశీ గర్జిస్తాడన్నారు.