రామగుండంను ఆదర్శంగా మారుస్తా : మక్కాన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌ఠాకూర్‌‌‌‌‌‌‌‌

రామగుండంను ఆదర్శంగా మారుస్తా  : మక్కాన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌ఠాకూర్‌‌‌‌‌‌‌‌

గోదావరిఖని, వెలుగు:  రామగుండంలో అధర్మంపై ధర్మం గెలిచిందని, గడీలను బద్దలు కొట్టి  ప్రజలంతా ధర్మం వైపు నిలబడ్డారని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌ఠాకూర్‌‌‌‌‌‌‌‌ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడైన తర్వాత ఆదివారం రాత్రి జేఎన్‌‌‌‌‌‌‌‌టీయూ కాలేజీలో, అనంతరం యైటింక్లయిన్‌‌‌‌‌‌‌‌ కాలనీ, గోదావరిఖనిలో రోడ్‌‌‌‌‌‌‌‌ షో నిర్వహించారు.

అనంతరం గాంధీ చౌరస్తాలో మాట్లాడుతూ రామగుండం ప్రాంతాన్ని ఆదర్శ నియోజకవర్గంగా మారుస్తానన్నారు. రామగుండం కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ ఏరియాను స్మార్ట్‌‌‌‌‌‌‌‌ సిటీగా చేయడం, జెన్‌‌‌‌‌‌‌‌కో బి‒పవర్‌‌‌‌‌‌‌‌ హౌస్‌‌‌‌‌‌‌‌ విద్యుత్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్‌‌‌‌‌‌‌‌ను పునరుద్ధరిస్తానన్నారు. కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌ అభివృద్ధికి రామగుండం అర్బన్‌‌‌‌‌‌‌‌ డెవలప్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ అథారిటీ(రుడా) ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు.

అవినీతికి తావులేకుండా నిజాయితీతో పనిచేస్తానని, ప్రజల ఆశలను వమ్ము చేయనని, మద్దతు తెలిపిన వివిధ పార్టీల లీడర్లను కలుపుకుని పనిచేస్తానని మక్కాన్‌‌‌‌‌‌‌‌ సింగ్‌‌‌‌‌‌‌‌ రాజ్‌‌‌‌‌‌‌‌ఠాకూర్‌‌‌‌‌‌‌‌ పేర్కొన్నారు.