కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయం:మల్రెడ్డి రంగారెడ్డి

కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయం:మల్రెడ్డి రంగారెడ్డి
  • పదేండ్లలో రాష్ట్రాన్ని నిండా ముంచారు: మల్ రెడ్డి రంగారెడ్డి 

హైదరాబాద్, వెలుగు: గత బీఆర్ఎస్ సర్కార్ పదేండ్లలో రాష్ట్రాన్ని నిండా ముంచిందని..కేటీఆర్ జైలుకు పోవడం ఖాయమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి అన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్​రావును త్వరలోనే ఈడీ విచారించనుందన్నారు. వాళ్ల చిట్టా తన దగ్గర ఉందని,  త్వరలోనే బయటపెడతానని హెచ్చరించారు.  మంగళవారం సీఎల్పీలో మల్ రెడ్డి రంగారెడ్డి మీడియాతో మాట్లాడారు. 

కావాలనే సీఎం రేవంత్ రెడ్డిని కేటీఆర్ బద్నాం చేస్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డికి మంచి పేరొస్తే  పుట్టగతులు ఉండవనే కేటీఆర్​నకిలీ రైతులను పంపి అధికారులపై దాడులు చేయించారని మండిపడ్డారు. బీఆర్ఎస్​ హయాంలో  దళితులు, గిరిజనులకు చెందిన 4.89 లక్షల ఎకరాలు తీసుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు.  మల్లన్న సాగర్ భూములు గుంజుకున్నది హరీశ్​రావు, కేటీఆర్ కాదా అని నిలదీశారు. 

కేసీఆర్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఫైర్ అయ్యారు. ఇందిరా గాంధీ ఇచ్చిన అసైన్డ్ భూములను కూడా కేసీఆర్ గుంజుకున్నారని రంగారెడ్డి పేర్కొన్నారు.