
నితిన్, శ్రీలీల జంటగా వెంకీ కుడుముల రూపొందించిన చిత్రం ‘రాబిన్ హుడ్’.మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మించిన ఈ సినిమా మార్చి 28న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు మేకర్స్.
ఈ క్రమంలో రాబిన్ హుడ్ చిత్ర బృందం మల్లారెడ్డి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా హీరో నితిన్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి వీరిద్దరూ కలిసి స్టేజీపై తమ డ్యాన్స్ తో అదరగొట్టారు. రాబిన్ హుడ్ లోని ట్రేండింగ్ సాంగ్ ‘అది దా సర్‌ప్రైజు' కు స్టెప్పులేసి స్టూడెంట్స్లో జోష్ పెంచారు.
అంతేకాకుండా ఎమ్మెల్యే మల్లారెడ్డి తనదైన శైలిలో స్పీచ్ ఇచ్చి ఇరగదీశారు. 'మార్చి 28 రోజు మన తెలంగాణా బిడ్డ నితిన్ రాబిన్ హుడ్ సినిమాను, డుమ్మా కొట్టి అయినా థియేటర్స్కి వెళ్లి చూడండి' అంటూ మల్లారెడ్డి ఆఫర్ ఇచ్చారు. ఆ వెంటనే నితిన్ మాట్లాడుతూ.. 'మీ 49వ పెళ్లిరోజు సందర్భంగా స్టేజీపై డ్యాన్స్ చేయాలని మల్లారెడ్డిని కోరారు. ఇక ఆ వెంటనే మల్లారెడ్డి హీరో నితిన్తో కలిసి అది దా సర్‌ప్రైజుకి స్టెప్పులేసి.. ఇదిదా స్టూడెంట్స్కి కావాల్సిన హంగామా అనేలా కిక్ ఇచ్చారు.
ఇక ఈ పాట విషయానికి వస్తే.. అదిదా పాట ఓ వర్గం వారిని ఆకట్టుకుంటూనే, మరింతగా విమర్శలు సైతం ఎదుర్కొంటోంది. ఇందులో కేతిక శర్మ గ్లామరస్ లుక్ పై, బోల్డ్, స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్‌లపై, డ్యాన్స్ మాస్టర్ శేఖర్ కంపోజ్ చేసిన స్టెప్పులపై విమర్శలు వస్తున్నాయి. ఇకపోతే, ఈ గ్లామర్ పాటను జీవీ ప్రకాష్ కుమార్ కంపోజ్ చేయగా చంద్రబోస్ సాహిత్యం అందించారు. డ్యాన్స్ మాస్టర్ శేఖర్ విజె నృత్యాలు సమకూర్చారు.
ఈ చిత్రంలో రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిశోర్ ఇతర పాత్రలు పోషించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, రవి శంకర్ నిర్మించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు.