మల్​రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి .. 25 కి.మీ. పాదయాత్ర చేసిన అభిమాని

మల్​రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలి .. 25 కి.మీ. పాదయాత్ర చేసిన అభిమాని

రంగారెడ్డి, వెలుగు: ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్​రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని ఆయన అభిమాని ఒకరు 25 కి.మీ పాదయాత్ర చేశారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కుబ్దుల్లాపూర్​కు చెందిన సందిల రోహిత్ గౌడ్.. హయత్ నగర్ నుంచి కొంగర రావిర్యాల వరకు ఫ్లెక్సీతో పాదయాత్ర చేశాడు.

 అనంతరం అక్కడి సూర్యగిరి ఎల్లమ్మ దేవాలయంలో  మల్ రెడ్డికి మంత్రి పదవి రావాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్​ను నమ్ముకొని పార్టీ బలోపేతానికి కృషి చేసిన రంగారెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని రోహిత్ కోరారు.