ఇది కాంగ్రెస్.. ఎప్పుడు, ఏమైనా జరగొచ్చు: ఎమ్మెల్యే మల్‌‌రెడ్డి రంగారెడ్డి

ఇది కాంగ్రెస్.. ఎప్పుడు, ఏమైనా జరగొచ్చు: ఎమ్మెల్యే మల్‌‌రెడ్డి రంగారెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఇది కాంగ్రెస్ పార్టీ అని, ఇక్కడ ఎప్పుడు, ఏమైనా జరగొచ్చని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌‌రెడ్డి రంగారెడ్డి అన్నారు. బుధవారం అసెంబ్లీ లాబీలో మీడియాతో ఆయన చిట్ చాట్ చేశారు. మంత్రివర్గ విస్తరణ ఎప్పుడనేది ఏమీ చెప్పలేమని, మంత్రి పదవులు ఎవరికి వస్తాయనేది కూడా కాంగ్రెస్‌‌లో చెప్పే పరిస్థితి ఉండదన్నారు.

 ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిస్థితులను చూస్తూ ఉండాలే.. తప్ప చేసేది అంటూ ఏమీ ఉండదని వెల్లడించారు. తనకు మంత్రి పదవి వస్తుందా, రాదా.. అనేది కూడా ఇప్పుడే ఏమీ చెప్పలేనన్నారు.