
పాలకుర్తి, వెలుగు : జనగామ జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి ఆదివారం పాలకుర్తి మండలంలోని కోతులబాధ లో మజీద్‌ను ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం కుటుంబాలకు పెద్దపీట వేస్తుందని అన్నారు. రాబోయే రంజాన్ వేడుకలకు కోతులబాద్ గ్రామంలో ప్రత్యేకంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తానని తెలిపారు.అల్లాహ్ ఆశీస్సులతో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందాలని
సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు రూపొందిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వం అన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు రాపాక సత్యనారాయణ, బైరు భార్గవ్ ముఖ్యనాయకులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.