సీఎం రేవంత్​రెడ్డిని కలిసిన పాలకుర్తి ఎమ్మెల్యే

తొర్రూరు, వెలుగు : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డిని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి, కాంగ్రెస్​పార్టీ నియోజకవర్గ ఇన్​చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డి సోమవారం హైదరాబాద్​లో కలిశారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ వినతిపత్రం అందించారు. 

సీఎం వారిని ఆప్యాయంగా పలుకరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని పలు అభివృద్ధి పనుల కోసం నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశామని, అందుకు సీఎం సానుకూలంగా స్పందించారని తెలిపారు.