![వరంగల్లో కడియం కావ్య గెలుపు ఖాయం : మామిడాల యశస్వినిరెడ్డి](https://static.v6velugu.com/uploads/2024/05/mla-mamidala-yashaswini-reddy-said-that-congress-candidate-kadiyam-kavya-victory-in-the-warangal-parliament-election-is-certain_QlTXJY9KwU.jpg)
పాలకుర్తి ( కొడకండ్ల ), వెలుగు : వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్అభ్యర్థి కడియం కావ్య గెలుపు ఖాయమైందని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. శనివారం జనగామ జిల్లా కొడకండ్ల మండలం లోని పలు గ్రామాల్లో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కడియం కావ్య గెలుపు ఖరారు కావడాన్ని జీర్ణించుకోలేక
ఆమె వ్యక్తిగత జీవితాన్ని విమర్శించడం రాజకీయ మూర్ఖత్వానికి పరాకాష్ఠ అని, ఎర్రబెల్లి ఎన్ని సర్కస్ ఫీట్లు వేసినా కాంగ్రెస్ విజయాన్ని ఆపలేరన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు ధరావత్ సురేశ్ నాయక్, నియోజకవర్గ యూత్ అధ్యక్షుడు ధరావత్ రాజేశ్ నాయక్, పార్టీ ముఖ్యనాయకులు, వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.