పాలకుర్తి (దేవరుప్పుల)/ తొర్రూరు, వెలుగు : పాలకుర్తిలోనూ 'హైడ్రా' అమలు చేయాలని స్థానిక ప్రజలు కోరుతున్నారని, ఇక్కడ కూడా ఖచ్చితంగా అమలు చేస్తామని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. సోమవారం జనగామ జిల్లా దేవరుప్పులలో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డితో కలిసి మాట్లాడారు. దిగజారుడు రాజకీయాలు చేస్తున్న మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రియల్ ఎస్టేట్ వ్యాపారుల ముసుగులో కాంగ్రెస్ నాయకులపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.
చినమడూరులో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గొడవలు జరిగితే కాంగ్రెస్నాయకులపై బురదజల్లే ప్రయత్నం చేయడం ఎర్రబెల్లి, బీఆర్ఎస్ నాయకుల విజ్ఞతకే వదిలి వేస్తున్నామన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం ఖానాపురం శివారు ఊకల్ గ్రామ క్రాస్ రోడ్డు వద్ద పీఏసీఎస్ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంక్‌ను ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జి ఝాన్సీరెడ్డి ప్రారంభించారు.
అనంతరం తొర్రూరు ఎంపీడీవో ఆఫీస్‌లో 85 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు అందించారు. మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్య, పీఏసీఎస్ చైర్మన్ కాకిరాల హరిప్రసాద్‌రావు, కాంగ్రెస్‌పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.