కాంగ్రెస్​కు లక్ష మెజార్టీ రావాలి

  •     ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి 

రాయపర్తి, వెలుగు : ఎంపీ ఎలక్షన్​లో వరంగల్​ కాంగ్రెస్​ అభ్యర్థి కడియం కావ్యకు లక్ష మెజార్టీ తీసుకురావడమే లక్ష్యంగా పని చేయాలని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి అన్నారు. శుక్రవారం వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సన్నూరు, కొత్తూరు, సూర్యతండాలో ప్రచారం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామ నాయకులే పార్టీకి ముఖ్యమని లక్ష మెజార్టీ లక్ష్యంగా పని చెయ్యాలన్నారు. సమావేశాల్లో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోతు ఆమ్యా నాయక్, పార్టీ మండలాధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.