రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ సంకల్పం : ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ సంకల్పం : ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

తొర్రూరు(పెద్దవంగర)/ రాయపర్తి, వెలుగు : రైతులను ఆదుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ సంకల్పమని పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి అన్నారు. మహబూబాబాద్​జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ కాకిరాల హరిప్రసాద్ తో కలిసి ఆమె ప్రారంభించారు. వరంగల్​జిల్లా రాయపర్తి మండలం మొరిపిరాల శివారులోని హరిచందన, భాగ్యలక్ష్మి జిన్నింగ్​మిల్లుల్లో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాలు, తిర్మలాయపల్లి, మైలారం, జగన్నాథపల్లి, గట్టికల్లు, ఊకల్లు గ్రామాల్లో ఐకేపీ, పీఏసీఎస్​ఆధ్వర్యంలో ఏర్పాటు

చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు. కార్యక్రమాల్లో కాంగ్రెస్​పార్టీ పెద్దవంగర, రాయపత్తి మండలాల అధ్యక్షుడు ముద్దసాని సురేశ్, ఈదులకంటి రవీందర్​రెడ్డి, బ్లాక్​ అధ్యక్షుడు జాటోతు అమ్యానాయక్, పాలకుర్తి సోమేశ్వర ఆలయ చైర్మన్​ తిరుమల కృష్ణమాచార్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

క్రీడాకారిణికి ఆర్థికసాయం

తొర్రూరు : మహబూబాబాద్ జిల్లా పెద్దముప్పారానికి చెందిన బల్గూరి తేజస్విని రెడ్డి జాతీయ స్థాయి ఫెన్సింగ్, కబడ్డీ పోటీలకు ఎంపిక కావడంతో శనివారం ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి పట్టణంలోని క్యాంప్​ ఆఫీస్​లో తేజస్విని సన్మానించి, అనంతరం రూ.35వేల ఆర్థికసాయం అందించారు. అదేవిధంగా ఇటీవల తొర్రూరు డివిజన్ నూతన ఆర్డీవోగా బాధ్యతలు చేపట్టిన గణేశ్​ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి బొకే అందజేశారు.