రైతులను మోసగిస్తే కఠిన చర్యలు : ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి

రైతులను మోసగిస్తే కఠిన చర్యలు : ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి

పాలకుర్తి, వెలుగు: ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులను చీటింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి హెచ్చరించారు. గురువారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలం రామరాజుపల్లి, పాలకుర్తి మండలం మల్లంపల్లి, తొర్రూరు, అయ్యంగారిపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులున్నా నేరుగా తనకు ఫోన్ చేసి చెప్పాలన్నారు.

 ప్రభుత్వం సన్నరకం వడ్లకు రూ.500 బోనస్​ఇస్తుందని, ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ధాన్యం విక్రయించాలని అన్నారు. అనంతరం కొడకండ్ల మండలంలోని బయ్యన్న రిజర్వాయర్ లో ఉచిత చేపపిల్లలను వదిలారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాపాక సత్యనారాయణ, కాంగ్రెస్​ పార్టీ పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల అధ్యక్షులు గిరగాని కుమారస్వామి గౌడ్, ధీరావత్​ సురేశ్​నాయక్, నల్లా శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.