పార్టీలో గొడవలు సృష్టిస్తే సహించేది లేదు : మామిడాల యశస్విని రెడ్డి

పార్టీలో గొడవలు సృష్టిస్తే సహించేది లేదు : మామిడాల యశస్విని రెడ్డి

పాలకుర్తి, వెలుగు: కాంగ్రెస్​లో ఉంటూ పార్టీలో గొడవలు పెట్టాలని చూస్తే సహించేది లేదని ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి హెచ్చరించారు. జనగామ జిల్లా పాలకుర్తిలో ఇటీవల మృతి చెందిన చిట్యాల ఐలమ్మ వారసుడు రామచంద్రం దశదిన కర్మ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాంగ్రెస్​ నియోజకవర్గ ఇన్​చార్జి హనుమాండ్ల ఝాన్సీరెడ్డితో కలిసి హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ఐలమ్మ పోరాట స్ఫూర్తితోనే పాలకుర్తిలో పోటీ చేసి గెలిచానన్నారు. పార్టీలో అందరూ కలిసి ఉంటేనే అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. 

పార్టీలో ఎవరు ఏంటో తనకు తెలుసునని, ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండాలని వార్నింగ్ ఇచ్చారు. ఐలమ్మ వారసుడు రామచంద్రం మృతి తీరని లోటని వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, మాజీ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్య తదితరులు పాల్గొన్నారు.