గ్యాదరి కిషోర్ జైలుకే... ఎమ్మెల్యే మందుల సామేలు

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ పై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు మండిపడ్డారు. సీఎంను విమర్శించే  స్థాయి నీకు లేదని, ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే తుంగతుర్తి ప్రజలు ఉరికిచ్చి కొడతారని ఆయన హెచ్చరించారు. గురువారం సీఎల్పీలో ఆయన మీడియాతో మాట్లాడారు.

కిషోర్ చిల్లర దొంగ, ఇసుక మాఫీయా ద్వారా వందల కోట్లు సంపాదించాడని, వేముల వాడలో భూములు కొన్నాడని ఆయన అవినీతిని అంతా ప్రభుత్వం బయటకు తీస్తుందని, త్వరలో జైల్ కు వెళ్లటం ఖాయమని , ఆయన చేసిన తప్పులకు 10 ఏళ్లు శిక్ష పడటం ఖాయమని ఆయన హెచ్చరించారు. కేసీఆర్ సీఎంగా ఉన్నపుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఇలా ఎవరూ మాట్లాడలేదని ఆయన అన్నారు.