రోడ్లకు ఫస్ట్ ప్రయారిటీ ఇస్తున్నం : మందుల సామెల్

మోత్కూరు, వెలుగు: గత ప్రభుత్వంలో నియోజకవర్గంలోని రోడ్లు అధ్వానంగా తయారయ్యాయని, వాటి అభివృద్ధికి ఫస్ట్‌‌ ప్రయారిటీ ఇస్తున్నామని  ఎమ్మెల్యే మందుల సామెల్ చెప్పారు.  శుక్రవారం మోత్కూర్ మండలం పాలడుగు, సదర్శాపురం, అడ్డగూడూరు మండలం ధర్మారంలో  సీసీ రోడ్డు పనులు, దత్తప్పగూడెంలో హైస్కూల్ ప్రహరీ పనులు ప్రారంభించారు.  

అనంతరం బిక్కేరు వాగుపై నిర్మిస్తున్న చెక్ డ్యామ్ పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాంప్రసాద్, ఎంపీడీవో మనోహర్ రెడ్డి, నాయకులు కంచర్ల యాదగిరి రెడ్డి, పోలేబోయిన లింగయ్య, అంతటి నర్సయ్య, రాచకొండ బాలరాజు , మరిపెల్లి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.