అర్హులైనవారికే ఇందిరమ్మ ఇండ్లు : ఎమ్మెల్యే మందల సామేల్

అర్హులైనవారికే ఇందిరమ్మ ఇండ్లు : ఎమ్మెల్యే మందల సామేల్

తుంగతుర్తి, వెలుగు : అర్హులైన వారికే ఇందిరమ్మ ఇండ్లు వస్తాయని ఎమ్మెల్యే మందల సామేల్ అన్నారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల సర్వేను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదలకు ఇండ్లు ఇచ్చేందుకు కృతనిచ్చేయంతో ఉందన్నారు.

బీఆర్ఎస్ నాయకులు అధికారం కోల్పోవడంతో మతిభ్రమించి మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం నూతనకల్ ప్రాథమిక సహకార సంఘం భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ గిరిజారెడ్డి, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.