రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా పాలన : ఎమ్మెల్యే మందుల సామేల్

రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా పాలన : ఎమ్మెల్యే మందుల సామేల్

తుంగతుర్తి, వెలుగు : సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో ప్రజాపాలన కొనసాగుతోందని, ప్రజా శ్రేయస్సు ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. సోమవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో లబ్ధిదారులకు మంజూరైన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన హామీ మేరకు రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపించామన్నారు

 సాంకేతిక కారణాల వల్ల కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదని, వారందరికీ కూడా రుణమాఫీ వర్తింపజేస్తామని తెలిపారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తుంగతుర్తి సింగిల్ విండో చైర్మన్ గుడిపాటి సైదులు, తహసీల్దార్ దయానందం, ఎంపీడీవో శేషుకుమార్, సీడీపీవో శ్రీజ, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గోవర్ధన్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరావు, రామ్మూర్తి, పట్టణ అధ్యక్షుడు రాంబాబు యాదవ్, మండల ఉపాధ్యక్షుడు వెంకన్న, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు శంకర్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.