మోత్కూరు, వెలుగు : మోత్కూరులో రోడ్డు విస్తరణ పనులను దసరా లోపు పూర్తి చేయాలని ఎమ్మెల్యే మందుల సామేల్ అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. మున్సిపల్ కేంద్రంలో టీయూఎఫ్ ఐడీసీ నిధులు రూ.5.63 కోట్లతో చేస్తున్న సీసీ రోడ్లు, డ్రైనేజీలకు బుధవారం ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మున్సిపల్ ఆఫీస్లో కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. సీసీ రోడ్లు, మురికి కాల్వల పనులను డిసెంబర్ నాటికి పూర్తి చేయాలన్నారు.
అభివృద్ది పనుల్లో నాణ్యతా లోపాలుంటే కాంట్రాక్టర్ల లైసెన్స్ రద్దు చేయిస్తానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గుర్రం కవితలక్ష్మీ నర్సింహారెడ్డి, వైస్ చైర్మన్ బి. వెంకటయ్య, కమిషనర్ సి.శ్రీకాంత్, పబ్లిక్ హెల్త్ ఈఈ సత్యనారాయణ, డీఈ మనోహర, కౌన్సిలర్లు పాల్గొన్నారు.