కాంగ్రెస్ పార్టీని నమ్మకండి: మర్రి జనార్దన్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీని నమ్మకండి:  మర్రి జనార్దన్ రెడ్డి

 నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : కాంగ్రెస్ పార్టీని నమ్మవద్దని ప్రజలను ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి కోరారు. తాడూరు మండలం గుట్టలపల్లి, పొలమూరు, అల్లాపూర్, ఎంగంపల్లి,  ఆకు నెల్లికుదురు గ్రామాల్లో ఆయన పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఇల్లును, కుటుంబాన్ని వదిలేసి వలసలు వెళ్లడం నిజం కాదా అని ప్రశ్నించారు.  కరెంటు అడిగితే కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ దే అని అన్నారు.  

ఎరువులు, విత్తనాల కోసం అనేక ఇబ్బందులు పడ్డామన్నారు. గతంలో ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి వదిలేసారు. ఆడపిల్ల పెళ్లి చేయాలంటే భూమి అమ్మేవారిని, ఇప్పుడు  సీఎం కేసీఆర్​ రూ. లక్ష ఇస్తున్నారన్నారు. కాంగ్రెస్ హయాంలో రైతుల ఆత్మహత్యలు ఉండేవన్నారు. ఈ ప్రభుత్వ హయాంలో పచ్చని పంటలతో భూములు కళకళలాడుతున్నాయన్నారు.   కార్యక్రమంలో డీసీసీ డైరెక్టర్ జక్క రఘునందన్ రెడ్డి, బైకానీ శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.