పెనుబల్లి, వెలుగు : మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్లు ఇచ్చామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్ ఆరోపించారు. పెనుబల్లి మండలం ముత్తగూడెం లో రూ.కోటి ఎస్డీఎఫ్ నిధులతో నిర్మిస్తున్న బోరెవెల్ పైప్ లైన్ నిర్మాణానికి ఆమె ఆదివారం శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వేసవికాలంలో నీటి ఎద్దడి ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టిందని తెలిపారు. గత ప్రభుత్వం మిషన్ భగీరథ పేరుతో వేల కోట్లు ఖర్చు పెట్టినా ప్రజలకు తాగేందుకు నీళ్లు ఇవ్వలేకపోయిందన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ గంట ప్రతాప్ ఎంపీఓ కిషోర్, జిల్లా కాంగ్రెస్ నాయకులు మట్టా దయానంద్, మండల కాంగ్రెస్ నాయకులు గూడూరి మాధవరెడ్డి, పసుమర్తి విశ్వనాథ్, దొంతు మాధవరావు, రాజబోయిన కోటేశ్వరావు, వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.