అభివృద్ధి కోసం మంత్రులకు ఎమ్మెల్యే వినతి 

అభివృద్ధి కోసం మంత్రులకు ఎమ్మెల్యే వినతి 

సత్తుపల్లి, వెలుగు : సత్తుపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు కేటాయించాలని కోరుతూ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి మంగళవారం హైదరాబాద్​లోని మినిస్టర్ క్వార్టర్స్ లో పలువురు మంత్రులను కలిశారు. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకటరెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిసి ఆయా శాఖలకు సంబంధించి అభివృద్ధి పనులు, నిధుల గురించి వినతి పత్రాలు అందజేశారు.

ఇటీవల రాష్ట్రంలో ప్రారంభమైన ఇందిరమ్మ ఇళ్ల సర్వే తీరుతెన్నుల పై పొంగులేటికి నివేదిక ఇచ్చారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ శ్రీదేవిని కలిసి సత్తుపల్లి మున్సిపాలిటీలో కొత్తగా చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, సమస్యలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట కాంగ్రెస్ నాయకులు చల్లగుల్ల నరసింహారావు, చలసాని సాంబశివరావు తదితరులు ఉన్నారు.