మహిళల ఆర్థికాభివృద్ధి సర్కారు పథకాలు : మట్టా రాగమయి

మహిళల ఆర్థికాభివృద్ధి సర్కారు పథకాలు : మట్టా రాగమయి
  • ఎమ్మెల్యే మట్టా రాగమయి 

పెనుబల్లి/కల్లూరు, వెలుగు :  రాష్ట్రంలో మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పథకాలు ప్రవేశపెడుతోందని సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి అన్నారు. మంగళవారం పెనుబల్లి, కల్లూరు మండలాల్లో ఆమె పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద రూ.కోట్లల్లో నిధులు మంజూరయ్యాయని, గ్రామాల్లో అభివృద్ధి పరుగులు పెట్టిస్తున్నామని తెలిపారు. 

త్వరలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు అందనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజేందర్ గౌడ్, కల్లూరు ఏఎంసీ చైర్మన్ నీరజ, వైస్ చైర్మన్ కోటేశ్వరరావు, చంద్రు నాయక్ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ జగన్, నాయకులు పి.వెంకటేశ్వరావు, రాధాకృష్ణ తదితరులు 
పాల్గొన్నారు.