కొడిమ్యాల,వెలుగు: కొండగట్టు బస్సు ప్రమాద బాధితులను ఆదుకుంటామని, స్పెషల్ కేటగిరిలో వారికి పింఛన్లు మంజూరు చేస్తామని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హామీ ఇచ్చారు. సోమవారం కొడిమ్యాల మండలం రాంసాగర్ గ్రామంలో రూ.20 లక్షలతో నిర్మించిన జీపీ బిల్డింగ్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచ్ మాధవి, జడ్పీటీసీ ప్రశాంతి, ఎంపీటీసీ జగన్మోహన్ రెడ్డి, లీడర్లు పాల్గొన్నారు.
చొప్పదండి, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. సోమవారం రుక్మాపూర్, సాంబయ్యపల్లి, మంగళపల్లి గ్రామాల్లో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. రుక్మాపూర్‌లో పల్లె దవఖాన, సాంబయ్యపల్లి, మంగళపల్లి గ్రామాల్లో జీపీ బిల్డింగ్‌లు ప్రారంభించారు. ఎంపీపీ రవీందర్, మున్సిపల్ చైర్మన్ నీరజ, వైస్ ఎంపీపీ విజయలక్ష్మి, సర్పంచులు లింగయ్య, రామక్రిష్ణ, నాగిరెడ్డి, ఎంపీటీసీలు తార, తిరుపతి, విజయలక్ష్మి పాల్గొన్నారు.