చిన్నారి హార్ట్‌‌‌‌‌‌‌‌ సర్జరీకి ఎమ్మెల్యే ఆర్థిక సాయం

కొడిమ్యాల, వెలుగు: పసిపాప హార్ట్ సర్జరీకి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రూ.లక్ష ఆర్థిక సాయం చేసి మానవత్వం చాటుకున్నారు. కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన చిలువేరి నరేశ్‌‌‌‌‌‌‌‌–శరణ్యలకు ఏడాది పాప ఉంది. కొద్దిరోజుల కింద పాపకు అనారోగ్యంతో హాస్పిటల్‌‌‌‌‌‌‌‌కు తీసుకెళ్లగా హార్ట్ లో హోల్ ఉందని డాక్టర్లు గుర్తించారు. ట్రీట్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌కు సుమారు రూ.8లక్షలు ఖర్చవుతుందని చెప్పారు.

 కాగా విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సత్యం గురువారం సతీసమేతంగా బాధిత కుటుంబం ఇంటికి వెళ్లి రూ.లక్ష నగదును సాయంగా అందజేశారు. మిగిలిన ఖర్చులను కూడా సీఎం సహాయ నిధి ద్వారా అందజేస్తామని ఎమ్మెల్యే వారికి భరోసా  ఇచ్చారు.