- చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
గంగాధర, వెలుగు : చివరి గింజ వరకు వడ్లు కొనుగోలు చేస్తామని, దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలం ఉప్పరమల్యాల, రంగారావుపల్లిలో ఏర్పాటుచేసిన కొనుగోలు సెంటర్లను ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు వచ్చిన వడ్లు తీసుకొచ్చిన రైతులు ఇబ్బంది పడకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాటు చేయాలన్నారు. ధాన్యం తీసుకోవడంలో మిల్లర్లు ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏఎంసీ చైర్మన్ జాగిరపు రజిత-, కురిక్యాల పీఏసీఎస్ చైర్మన్ తిర్మల్రావు, పార్టీ మండలాధ్యక్షుడు మనోహర్, లీడర్లు రాజగోపాల్రెడ్డి, బాపురెడ్డి, కిషన్, రాజిరెడ్డి పాల్గొన్నారు.