సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
  • చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

చొప్పదండి, వెలుగు: రాష్ట్రంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందని, వాటిని పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సూచించారు. సోమవారం చొప్పదండి మండల కేంద్రంలో కాంగ్రెస్ శ్రేణులతో కలసి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పార్టీ మండల కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొని దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించేందుకు కష్టపడి పనిచేయాలన్నారు.

కాగా 300 మంది కార్యకర్తలకు రూ.10 లక్షల విలువైన ప్రమాద బీమా పత్రాలను కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం పట్టణంలో రూ.20లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్​ కొత్తూరి మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మెప్మా పీడీ వేణుమాధవ్​రెడ్డి, కౌన్సిలర్లు శ్రీనివాస్​, మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, సంధ్య, మానస, జిల్లా కాంగ్రెస్​ పార్టీ వర్కింగ్​ ప్రెసిడెంట్​ పద్మాకర్​రెడ్డి, మండల, పట్టణ కాంగ్రెస్​ అధ్యక్షులు శ్రీనివాస్​రెడ్డి, చందు, పాల్గొన్నారు.