కౌశిక్ రెడ్డి ఓ బచ్చా

కౌశిక్ రెడ్డి ఓ బచ్చా
  • చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే బడితె పూజ తప్పదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హెచ్చరించారు. కౌశిక్ రెడ్డి కండకావరంతో మాట్లాడుతున్నారని సోమవారం పత్రిక ప్రకటనలో ఆయన ఫైర్ అయ్యారు.

రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పదవి ఇప్పించేత స్థాయికి చేరకున్నావా అని కౌశిక్ రెడ్డిని ఆయన ప్రశ్నించారు. కౌశిక్ రెడ్డి మానసిక స్థితిపై అనుమానాలు ఉన్నాయని, ఆయనకు తక్షణమే వైద్య పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని మేడిపల్లి సత్యం కోరారు. కౌశిక్ రెడ్డిని ముందు పెట్టి కేటీఆర్ శిఖండి రాజకీయాలు చేస్తున్నారని సత్యం మండిపడ్డారు.