
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అనారోగ్యానికి గురయ్యారు. మంగళవారం రాత్రి ఆయనకు ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబసభ్యులు నెల్లూరులోని అపోలో ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు.. చంద్రశేఖర్‌రెడ్డి గుండెపోటుకు గురైనన్నట్లు గుర్తించారు. మెరుగైన చికిత్స కోసం మేకపాటి చంద్రశేఖర్ రెడ్డిని చెన్నై ఆస్పత్రికి తరలించారు.