- సీఎంను కోరిన ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్
గోదావరిఖని, వెలుగు: రామగుండంలో మూసివేసిన 62.5 మెగావాట్ల పవర్ ప్లాంట్ స్థానంలో కొత్తగా 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ వచ్చినందున దాని నిర్మాణాన్ని వేగంగా చేపట్టాలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.
శుక్రవారం హైదరాబాద్‌లో ఆయన సీఎంను కలిసి పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సహకరించినందుకు పుష్ఫగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. గోదావరిఖనిలోని సింగరేణి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీలో అదనపు విభాగాలు ఏర్పాటు చేయాలని సీఎంను కోరారు.