గోదావరిఖని, వెలుగు: మదర్ థెరిస్సాను ఆదర్శంగా తీసుకొని నర్సింగ్ కాలేజీ స్టూడెంట్లు పేషెంట్లకు సేవలందించాలని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ సూచించారు. సోమవారం గోదావరిఖనికి మంజూరైన ప్రభుత్వ నర్సింగ్ కాలేజీని ఆయన ప్రారంభించారు. అలాగే కాలేజీ నూతన బిల్డింగ్‌కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో 16 నర్సింగ్ కాలేజీలను సీఎం రేవంత్ రెడ్డి వర్చువల్‌గా ప్రారంభించారన్నారు.
రోగులకు మెరుగైన వైద్య సేవలందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. అనంతరం మైత్రి ట్రాన్స్ క్లినిక్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో మేయర్ అనిల్‌కుమార్, డీఎంహెచ్‌వో అన్న ప్రసూన, మెడికల్, నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్స్, కార్పొరేటర్లు, లీడర్లు పాల్గొన్నారు.