
గోదావరిఖని, వెలుగు: రామగుండం నియోజకవర్గంలో టూరిజం అభివృద్ధిపై ఫోకస్ పెట్టినట్టు ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్‌ఠాకూర్ తెలిపారు. ఆదివారం గోదావరి ఒడ్డున గల సమ్మక్క జాతర స్థలంలో రూ.3 కోట్ల సింగరేణి నిధులతో సీసీ రోడ్లు, షెడ్లు, ఎకో పార్క్, స్నానఘట్టాలు, సైడ్ వాల్స్, టాయిలెట్స్, తదితర నిర్మాణాలకు జీఎం లలిత్కుమార్తో కలిసి భూమిపూజ చేశారు.
అలాగే ఓసీపీ 5 పక్కన గల కబరస్థాన్లో రూ.98 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అంతకుముందు క్యాంప్ఆఫీస్లో రామగుండం, పాలకుర్తి, అంతర్గాం మండలాలకు చెందిన 148 మంది కల్యాణలక్ష్మి, 23 మంది షాదీముబారక్ లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అనంతరం నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఎమ్మెల్యే పాల్గొన్నారు.