జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధం : ఎంఎస్ ‌‌రాజ్ ‌‌ఠాకూర్​

గోదావరిఖని, వెలుగు : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్​ రాజ్​ఠాకూర్​ తెలిపారు. గురువారం గోదావరిఖని ప్రెస్​ క్లబ్​ ఆధ్వర్యంలో రూపొందించిన డైరీని ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చే అంశంపై సీఎం రేవంత్​ రెడ్డి చర్చించారన్నారు.

త్వరలోనే నియోజకవర్గంలోని జర్నలిస్టులకు సైతం ఇంటి స్థలాలు వచ్చేలా తాను కృషి చేస్తానని హామీ ఇచ్చారు.  రామగుండం నియోజకవర్గ అభివృద్ధికి సీఎంను ఒప్పించి రూ.130కోట్లు మంజూరు చేయించానన్నారు. అనంతరం నియోజవర్గంలో గంజాయి సప్లై చేస్తున్న, వినియోగిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపాలని పోలీస్ అధికారులకు సూచించారు.

కార్యక్రమంలో గోదావరిఖని ఏసీపీ రమేశ్, మున్సిపల్ కమిషనర్​సీహెచ్ శ్రీకాంత్, వన్ టౌన్ సిఐ ఇంద్రసేనా రెడ్డి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పూదరి కుమార్, క్లబ్ తొలి అధ్యక్షుడు లచ్చయ్య, క్లబ్ ప్రధాన కార్యదర్శి పందిళ్ల శ్యామ్ సుందర్, ఇతర జర్నలిస్టులు పాల్గొన్నారు.